Best ACs: బడ్జెట్ ధరలో చల్లని కబురు.. రూ. 20 వేల లోపే బెస్ట్ ఏసీలు ఇవే!
ప్రస్తుత ఎండల తీవ్రత దృష్ట్యా సామాన్యులకు సైతం అందుబాటులో ఉండేలా రూ. 15వేల నుండి రూ. 20వేల లోపు ఉన్న ఉత్తమ ఏసీలను ( Best ACs Under rs 20000 ) ఇక్కడ అందిస్తున్నాం.. వోల్టాస్ (Voltas) 0.80 టన్ 2 స్టార్ విండో ఏసీ బడ్జెట్ ధరలో నమ్మకమైన బ్రాండ్ కోరుకునే వారికి ఇది మంచి ఎంపిక. సుమారు రూ.18 వేల 291 ధరలో లభించే ఈ ఏసీలో కాపర్ కాయిల్, ఎల్సీడీ రిమోట్, ఆటో రీస్టార్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇది 2600 వాట్ల కూలింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. బ్లూస్టార్ (Blue Star) 1 టన్ 2 స్టార్ విండో ఏసీ.. ఇది 100-200 చదరపు అడుగుల గదులకు సరిగ్గా సరిపోతుంది. ఇందులో టర్బో కూల్ మోడ్, డస్ట్ ఫిల్టర్, హ్యుమిడిటీ కంట్రోల్ వంటి అధునాతన ఫీచర్లు ఉన్నాయి. ఫిక్స్డ్ స్పీడ్ రొటరీ కంప్రెసర్ వల్ల కూలింగ్ స్థిరంగా ఉంటుంది. లాయిడ్ (Lloyd) 1 టన్ 2 స్టార్ స్ప్లిట్ ఏసీ.. తక్కువ శబ్దంతో పనిచేసే స్ప్లిట్ ఏసీ కావాలనుకునే వారికి ఇది బెస్ట్ ఛాయిస్. ఇందులో PM 2.5 ఫిల్టర్ , యాంటీ-వైరల్ ఫిల్టర్లు ఉండటం వల్ల గాలి శుభ్రంగా ఉంటుంది. దీనికి ప్రత్యేకంగా స్టెబిలైజర్ అవసరం లేకపోవడం మరో విశేషం. ఇంటెక్స్ 1 టన్ ఎయిర్ కండిషనర్.. తక్కువ ధరలో ఎక్కువ క...