OG OTT: పవన్ ఫ్యాన్స్‌కు అలెర్ట్.. ఈ రోజు అర్ధరాత్రి నుంచి ఓటీటీల్లో ఓజీ
పవన్ కళ్యాణ్ అభిమానులకు బిగ్ అలెర్ట్. ఆయన హీరోగా ఇటీవల నటించిన ఓజీ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఈ రోజు అర్ధరాత్రి 12 గంటల నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం అయిన నెట్‌ఫ్లిక్స్‌లో ఈ ఓజీ మూవీ స్ట్రీమింగ్ ( OG Movie OTT Streaming ) కాబోతుంది. కాగా, సెప్టెంబర్ 25న ఈ ఓజీ మూవీ రిలీజ్ అయింది. 24వ తేదీన వచ్చిన ప్రీమియర్స్‌తోనే ఈ మూవీ పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఇక థియేట్రికల్ ఫుల్ రన్ ముగిసే సమయానికి ఈ మూీ 300 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. ఇది పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే హైయెస్ట్ కలెక్షన్స్ అని చెప్పొచ్చు. కాగా, ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గ్యాంగ్ స్టార్ పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే. తెలుగుతో పాటు అన్నీ భాషల సినిమాల ఓటీటీ అప్డేట్స్ ఫాస్ట్‌గా తెలుసుకోవడానికి బిగ్ టీవీ లైవ్ వెబ్ సైట్‌ను ఫాలో అవ్వండి.