Posts

Best ACs: బడ్జెట్ ధరలో చల్లని కబురు.. రూ. 20 వేల లోపే బెస్ట్ ఏసీలు ఇవే!

Image
 ప్రస్తుత ఎండల తీవ్రత దృష్ట్యా సామాన్యులకు సైతం అందుబాటులో ఉండేలా రూ. 15వేల నుండి రూ. 20వేల లోపు ఉన్న ఉత్తమ ఏసీలను ( Best ACs Under rs 20000 ) ఇక్కడ అందిస్తున్నాం.. వోల్టాస్ (Voltas) 0.80 టన్ 2 స్టార్ విండో ఏసీ బడ్జెట్ ధరలో నమ్మకమైన బ్రాండ్ కోరుకునే వారికి ఇది మంచి ఎంపిక. సుమారు రూ.18 వేల 291 ధరలో లభించే ఈ ఏసీలో కాపర్ కాయిల్, ఎల్సీడీ రిమోట్, ఆటో రీస్టార్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇది 2600 వాట్ల కూలింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. బ్లూస్టార్ (Blue Star) 1 టన్ 2 స్టార్ విండో ఏసీ.. ఇది 100-200 చదరపు అడుగుల గదులకు సరిగ్గా సరిపోతుంది. ఇందులో టర్బో కూల్ మోడ్, డస్ట్ ఫిల్టర్, హ్యుమిడిటీ కంట్రోల్ వంటి అధునాతన ఫీచర్లు ఉన్నాయి. ఫిక్స్డ్ స్పీడ్ రొటరీ కంప్రెసర్ వల్ల కూలింగ్ స్థిరంగా ఉంటుంది. లాయిడ్ (Lloyd) 1 టన్ 2 స్టార్ స్ప్లిట్ ఏసీ.. తక్కువ శబ్దంతో పనిచేసే స్ప్లిట్ ఏసీ కావాలనుకునే వారికి ఇది బెస్ట్ ఛాయిస్. ఇందులో PM 2.5 ఫిల్టర్ , యాంటీ-వైరల్ ఫిల్టర్లు ఉండటం వల్ల గాలి శుభ్రంగా ఉంటుంది. దీనికి ప్రత్యేకంగా స్టెబిలైజర్ అవసరం లేకపోవడం మరో విశేషం. ఇంటెక్స్ 1 టన్ ఎయిర్ కండిషనర్.. తక్కువ ధరలో ఎక్కువ క...

Jana Nayagan: దళపతి జననాయగన్ రిలీజ్ సస్పెన్స్.. ఎన్నికల ముందే వస్తుందా? తర్వాతేనా?

Image
 కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి కెరీర్‌లో చివరి చిత్రంగా వస్తున్న జననాయగన్ భారీ అంచనాల మధ్య రూపొందుతోంది. తెలుగులో సూపర్ హిట్ అయిన బాలకృష్ణ భగవంత్ కేసరి చిత్రానికి రీమేక్‌గా వస్తున్న ఈ సినిమాకు హెచ్. వినోద్ దర్శకత్వం వహిస్తున్నారు. ( Jana Nayagan Release Date )ఇందులో విజయ్ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుండగా.. బాబీ డియోల్, మమిత బైజు కీలక పాత్రలు పోషిస్తున్నారు. నిజానికి ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 9నే విడుదల కావాల్సి ఉంది. అయితే.. చిత్ర నిర్మాతలకు , సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ (CBFC) మధ్య తలెత్తిన చట్టపరమైన వివాదాల వల్ల వాయిదా పడింది. తాజాగా మద్రాస్ హైకోర్టులో వేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకోవడానికి నిర్మాతలు నిర్ణయించుకోవడంతో ఈ వివాదం సద్దుమణిగింది. సినిమాను మరోసారి రివైజింగ్ కమిటీకి పంపి సెన్సార్ ప్రక్రియను పూర్తి చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. దీంతో సినిమా విడుదలకు ఉన్న ప్రధాన అడ్డంకి తొలగిపోయింది. మార్చి 19న యష్ నటించిన టాక్సిక్ చిత్రంతో పోటీ పడాలని భావించినప్పటికీ.. ప్రస్తుత పరిస్థితుల్లో చిత్ర బృందం వెనక్కి తగ్గింది. దీనికి ప్రధాన కారణం తమిళనాడులో జరగబోయే ...

Bharat Bandh feb 13th రేపే భారత్ బంద్.. ఏవి పనిచేస్తాయి? ఏవి పనిచేయవు? పూర్తి వివరాలు ఇవే!

Image
 కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు పిలుపునిచ్చిన భారత్ బంద్ గురించిన కీలక అంశాలు ఇప్పుడు చూద్దాం..  కేంద్రం ప్రవేశపెట్టిన కొత్త కార్మిక చట్టాలు కార్మికుల రక్షణను బలహీనపరుస్తాయని.. ( Bharat Bandh Feb 12th ) ఉద్యోగ భద్రతను తగ్గిస్తాయని ఆరోపిస్తూ 10 ప్రధాన కేంద్ర కార్మిక సంఘాలు (CITU, AITUC, INTUC) ఈ దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయి. వీరికి రైతు సంఘాలు కూడా మద్దతు ప్రకటించాయి. ఈ బంద్ వల్ల ప్రధానంగా బ్యాంకింగ్ సేవలు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రజా రవాణాపై ప్రభావం పడనుంది. మార్కెట్లు, దుకాణాలు మూతపడే అవకాశం ఉంది. ముఖ్యంగా కేరళ, కర్ణాటక, ఒడిశా వంటి రాష్ట్రాల్లో విద్యా సంస్థలకు అంతరాయం కలగవచ్చు. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు సుమారు 30 కోట్లకు పైగా కార్మికులు ఈ నిరసనలో పాల్గొంటారని అంచనా. దశాబ్ద కాలం తర్వాత అన్ని సంఘాలు ఏకతాటిపైకి వచ్చి నిర్వహిస్తున్న అతిపెద్ద సమ్మెగా ఇది నిలవనుంది. కొత్త చట్టాల వల్ల ఉద్యోగులను నియమించుకోవడం లేదా తొలగించడంలో యజమానులకు విపరీతమైన అధికారాలు లభిస్తాయని.. ఇది కార్మికుల హక్కులను కాలరాయడమేనని యూనియన్లు విమర్శిస్తు...

Telangana Municipal Elections: ఓటర్ల క్యూ.. నేతల ఫైట్.. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల లైవ్ అప్‌డేట్స్

Image
 రాష్ట్రవ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల పరిధిలో పోలింగ్ ఉత్సాహంగా కొనసాగుతోంది. మొత్తం 52,17,413 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనుండగా..  ఉదయం 7 గంటల నుంచే ప్రజలు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఉదయం 11 గంటల సమయానికి రాష్ట్రవ్యాప్తంగా 28.48 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. TG Municipal Elections ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గమైన కొడంగల్‌లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఓటు వేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. అలాగే.. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నల్గొండలో ఓటు వేశారు. నల్గొండ కార్పొరేషన్‌ను కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఓ పక్క ఎన్నికలు తాపీగా సాగుతున్నాయి అనుకుంటున్న లోపే.. మరో వైపు ఎన్నికల వేళ పలు చోట్ల రాజకీయ పార్టీల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి.  వర్ధన్నపేట పోలింగ్ కేంద్రం వద్ద బీఆర్ఎస్ నేతలు ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ కాంగ్రెస్, బీజేపీ నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. నర్సాపూర్  15వ ...

TVS Bike Price Hike: టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్, రేడియన్ ప్రియం.. 2026 కొత్త ధరల జాబితా ఇదే!

Image
 ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్ ( TVS Bikes Price Hike ) తన వినియోగదారులకు షాక్ ఇచ్చింది. తన పాపులర్ మోడల్స్ అయిన స్టార్ సిటీ ప్లస్ ,  రేడియన్ బైకుల ధరలను పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. 2026 సంవత్సరానికి సంబంధించి ఈ రెండు మోడళ్లలోని అన్ని వేరియంట్లపై ధరల పెంపు వర్తిస్తుందని కంపెనీ ప్రకటించింది. ఇన్ ఫుట్స్ ధర పెరగడంతో పాటు గ్లోబల్ మార్కెట్‌లో రూపాయి మారకం విలువ కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ వెల్లడించింది. TVS స్టార్ సిటీ ప్లస్ : స్టార్ సిటీ ప్లస్‌లో డ్రమ్, డిస్క్ వేరియంట్ల ధరలు స్వల్పంగా పెరిగాయి. గతంలో రూ. 72,200 గా ఉన్న డ్రమ్ వేరియంట్ ధర ఇప్పుడు రూ. 72,500కు చేరుకుంది. అలాగే..  డిస్క్ వేరియంట్ ధర రూ. 74,900 నుండి రూ. 75,200కు పెరిగింది.  TVS రేడియన్: రేడియన్ మోడల్‌లోని వివిధ ఎడిషన్ల ధరలు కూడా మార్పులు చేయబడ్డాయి. అత్యంత తక్కువ ధర కలిగిన ఆల్ బ్లాక్ ఎడిషన్ ధర రూ. 55,100 నుండి రూ. 55,400కు పెరిగింది. బేస్ ఎడిషన్ ధర ఇప్పుడు రూ.61,600 నుండి  రూ. 61,900కు చేరింది. టెక్నాలజీ పరంగా మెరుగైన డిజి డ్రమ్ వేరియంట్ ధర రూ. 74,500 కాగా, టాప్ ఎండ్ డిజి డిస్క...

NBK111 బాలయ్యతో మిల్క్ బ్యూటీ.. అబ్బా ఏం కాంబినేషన్‌రా బాబు

Image
 నట సింహం నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ 2 రిలీజ్ సిద్దమవుతుంది. దీని తర్వాత గోపిచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య సినిమా చేస్తున్నాడు. NBK 111 అనే వర్కింగ్ టైటిల్‌తో ఇప్పటికే అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. ఈ సినిమాలో హీరోయిన్‌గా నయనతార నటిస్తుంది. అయితే, ఈ సినిమాలో ఓ ఐటెం సాంగ్ కూడా ఉండబోతుందంట. ఇటీవల బాలకృష్ణ సినిమా అంటే కచ్చితంగా స్పెషల్ సాంగ్ ఉండేలా మేకర్స్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రాబోయే ఈ సినిమాలో కూడా ఒక స్పెషల్ సాంగ్ ఉండబోతుందని సమాచారం. అయితే ఈ పాటలో నటించడం కోసం రంగంలోకి స్టార్ బ్యూటీని దించబోతున్నట్టు తెలుస్తుంది. మరి బాలయ్యతో కలిసి స్పెషల్ స్టెప్పులు వేయబోతున్న ఆ ముద్దుగుమ్మ ఎవరు అనే విషయానికొస్తే తను మరెవరో కాదు మిల్క్ బ్యూటీ తమన్నా ( Tamannaah In NBK111 ) అంటూ వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఇలా తమన్నా బాలయ్య పక్కన స్పెషల్ సాంగ్ చేయబోతున్నట్టు వస్తున్న ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది. ఇలా.. సినిమా ( Movies News In Telugu ) అప్డేట్స్‌ను ముందుగానే తెలుసుకోవడానికి బిగ్ టీవీ ఫాలో అవ్వండి

ప్రభాస్ vs రణబీర్ కపూర్… అసలేం ప్లాన్ చేస్తున్నావ్ సందీప్ రెడ్డి

Image
  ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో స్పిరిట్ అనే మూవీ వస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ మూవీ పూజా కార్యక్రమాలు కూడా ఇటీవల జరిగాయి. మెగాస్టార్ చిరంజీవి గెస్ట్‌గా వచ్చారు. ఇదిలా ఉండగా… చిరంజీవి అతిథి పాత్రలో నటించబోతున్నారంటూ వార్తలు వచ్చాయి కానీ ఈ వార్తలను పూర్తిగా సందీప్ రెడ్డి ఖండించారు. ఈ సినిమాలో క్యామియో పాత్రలో నటించడం కోసం టాలీవుడ్ హీరోలను కాకుండా సందీప్ రెడ్డి బాలీవుడ్ స్టార్ హీరోను రంగంలోకి దించబోతున్నారని తెలుస్తోంది. ఈ సినిమాలో క్యామియో పాత్ర చాలా కీలకంగా ఉండబోతున్నట్లు సమాచారం. అందుకే సందీప్ రెడ్డి ఈ క్యామియో పాత్రలో నటించడం కోసం బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ ( Ranbir Kapoor In Spirit) ను సంప్రదించడంతో రణబీర్ సైతం ఈ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ఇదివరకే సందీప్ రెడ్డి, రణబీర్ కపూర్ కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన యానిమల్ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుందో మనకు తెలిసిందే. అందుకే సందీప్ రెడ్డి అడగడంతో వెంటనే రణబీర్ కపూర్ స్పిరిట్ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. మరి స్పిరిట్ సినిమాలో రణబీర్ కపూర్ పాత్...