Best ACs: బడ్జెట్ ధరలో చల్లని కబురు.. రూ. 20 వేల లోపే బెస్ట్ ఏసీలు ఇవే!

 ప్రస్తుత ఎండల తీవ్రత దృష్ట్యా సామాన్యులకు సైతం అందుబాటులో ఉండేలా రూ. 15వేల నుండి రూ. 20వేల లోపు ఉన్న ఉత్తమ ఏసీలను (Best ACs Under rs 20000) ఇక్కడ అందిస్తున్నాం..



వోల్టాస్ (Voltas) 0.80 టన్ 2 స్టార్ విండో ఏసీ

బడ్జెట్ ధరలో నమ్మకమైన బ్రాండ్ కోరుకునే వారికి ఇది మంచి ఎంపిక. సుమారు రూ.18 వేల 291 ధరలో లభించే ఈ ఏసీలో కాపర్ కాయిల్, ఎల్సీడీ రిమోట్, ఆటో రీస్టార్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇది 2600 వాట్ల కూలింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.

బ్లూస్టార్ (Blue Star) 1 టన్ 2 స్టార్ విండో ఏసీ..

ఇది 100-200 చదరపు అడుగుల గదులకు సరిగ్గా సరిపోతుంది. ఇందులో టర్బో కూల్ మోడ్, డస్ట్ ఫిల్టర్, హ్యుమిడిటీ కంట్రోల్ వంటి అధునాతన ఫీచర్లు ఉన్నాయి. ఫిక్స్డ్ స్పీడ్ రొటరీ కంప్రెసర్ వల్ల కూలింగ్ స్థిరంగా ఉంటుంది.

లాయిడ్ (Lloyd) 1 టన్ 2 స్టార్ స్ప్లిట్ ఏసీ..

తక్కువ శబ్దంతో పనిచేసే స్ప్లిట్ ఏసీ కావాలనుకునే వారికి ఇది బెస్ట్ ఛాయిస్. ఇందులో PM 2.5 ఫిల్టర్ , యాంటీ-వైరల్ ఫిల్టర్లు ఉండటం వల్ల గాలి శుభ్రంగా ఉంటుంది. దీనికి ప్రత్యేకంగా స్టెబిలైజర్ అవసరం లేకపోవడం మరో విశేషం.

ఇంటెక్స్ 1 టన్ ఎయిర్ కండిషనర్..

తక్కువ ధరలో ఎక్కువ కూలింగ్ పవర్ (3350 W) అందించే ఏసీ ఇది. ఇందులో బ్యాక్టీరియాను నిరోధించే ఫిల్టర్లు, రాత్రి వేళ సౌకర్యవంతమైన నిద్ర కోసం బేబీ స్లీప్ మోడ్ వంటి ఆప్షన్లు ఉన్నాయి. ఇలాంటి మరిన్నిఆసక్తికర (Tech News in Telugu)వార్తల కోసం బిగ్ టీవీ లైవ్ వెబ్ సైట్ చూడండి.

Comments

Popular posts from this blog

Jana Nayagan: దళపతి జననాయగన్ రిలీజ్ సస్పెన్స్.. ఎన్నికల ముందే వస్తుందా? తర్వాతేనా?

Bharat Bandh feb 13th రేపే భారత్ బంద్.. ఏవి పనిచేస్తాయి? ఏవి పనిచేయవు? పూర్తి వివరాలు ఇవే!

NBK111 బాలయ్యతో మిల్క్ బ్యూటీ.. అబ్బా ఏం కాంబినేషన్‌రా బాబు