Jana Nayagan: దళపతి జననాయగన్ రిలీజ్ సస్పెన్స్.. ఎన్నికల ముందే వస్తుందా? తర్వాతేనా?
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి కెరీర్లో చివరి చిత్రంగా వస్తున్న జననాయగన్ భారీ అంచనాల మధ్య రూపొందుతోంది. తెలుగులో సూపర్ హిట్ అయిన బాలకృష్ణ భగవంత్ కేసరి చిత్రానికి రీమేక్‌గా వస్తున్న ఈ సినిమాకు హెచ్. వినోద్ దర్శకత్వం వహిస్తున్నారు. (Jana Nayagan Release Date)ఇందులో విజయ్ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుండగా.. బాబీ డియోల్, మమిత బైజు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
నిజానికి ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 9నే విడుదల కావాల్సి ఉంది. అయితే.. చిత్ర నిర్మాతలకు , సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ (CBFC) మధ్య తలెత్తిన చట్టపరమైన వివాదాల వల్ల వాయిదా పడింది. తాజాగా మద్రాస్ హైకోర్టులో వేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకోవడానికి నిర్మాతలు నిర్ణయించుకోవడంతో ఈ వివాదం సద్దుమణిగింది. సినిమాను మరోసారి రివైజింగ్ కమిటీకి పంపి సెన్సార్ ప్రక్రియను పూర్తి చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. దీంతో సినిమా విడుదలకు ఉన్న ప్రధాన అడ్డంకి తొలగిపోయింది.
మార్చి 19న యష్ నటించిన టాక్సిక్ చిత్రంతో పోటీ పడాలని భావించినప్పటికీ.. ప్రస్తుత పరిస్థితుల్లో చిత్ర బృందం వెనక్కి తగ్గింది. దీనికి ప్రధాన కారణం తమిళనాడులో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలే. విజయ్ తన రాజకీయ పార్టీ టీవీకే (TVK) ద్వారా ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. ఒకవైపు రాజకీయ ప్రచారాలు.. మరోవైపు సినిమా ప్రమోషన్లు నిర్వహించడం కష్టమని భావించి.. నిర్మాతలు విజయ్ రాజకీయ ప్రస్థానానికి ఇబ్బంది కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తర్వాతే అధికారిక తేదీని ప్రకటించాలని మేకర్స్ భావిస్తున్నారు. ప్రస్తుతానికి ఈ సినిమాను ఏప్రిల్ లేదా మే నెలలో విడుదల చేసే అవకాశం ఉంది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నేరుగా విడుదల కానున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి మరిన్నిఆసక్తికర (Movies News In Telugu) వార్తల కోసం బిగ్ టీవీ లైవ్ వెబ్ సైట్ చూడండి.

Comments
Post a Comment