TVS Bike Price Hike: టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్, రేడియన్ ప్రియం.. 2026 కొత్త ధరల జాబితా ఇదే!

 ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్ (TVS Bikes Price Hike) తన వినియోగదారులకు షాక్ ఇచ్చింది. తన పాపులర్ మోడల్స్ అయిన స్టార్ సిటీ ప్లస్ ,  రేడియన్ బైకుల ధరలను పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. 2026 సంవత్సరానికి సంబంధించి ఈ రెండు మోడళ్లలోని అన్ని వేరియంట్లపై ధరల పెంపు వర్తిస్తుందని కంపెనీ ప్రకటించింది. ఇన్ ఫుట్స్ ధర పెరగడంతో పాటు గ్లోబల్ మార్కెట్‌లో రూపాయి మారకం విలువ కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ వెల్లడించింది.



TVS స్టార్ సిటీ ప్లస్:

స్టార్ సిటీ ప్లస్‌లో డ్రమ్, డిస్క్ వేరియంట్ల ధరలు స్వల్పంగా పెరిగాయి. గతంలో రూ. 72,200 గా ఉన్న డ్రమ్ వేరియంట్ ధర ఇప్పుడు రూ. 72,500కు చేరుకుంది. అలాగే..  డిస్క్ వేరియంట్ ధర రూ. 74,900 నుండి రూ. 75,200కు పెరిగింది. 

TVS రేడియన్:

రేడియన్ మోడల్‌లోని వివిధ ఎడిషన్ల ధరలు కూడా మార్పులు చేయబడ్డాయి. అత్యంత తక్కువ ధర కలిగిన ఆల్ బ్లాక్ ఎడిషన్ ధర రూ. 55,100 నుండి రూ. 55,400కు పెరిగింది. బేస్ ఎడిషన్ ధర ఇప్పుడు రూ.61,600 నుండి  రూ. 61,900కు చేరింది. టెక్నాలజీ పరంగా మెరుగైన డిజి డ్రమ్ వేరియంట్ ధర రూ. 74,500 కాగా, టాప్ ఎండ్ డిజి డిస్క్ వేరియంట్ ధర రూ. 77,900 నుండి రూ. 78,200కు పెరిగింది.

ధరల విషయంలో మార్పులు చేసినప్పటికీ..  ఈ రెండు బైకుల ఫీచర్లు లేదా మెకానికల్ అంశాల్లో ఎలాంటి మార్పులు చేయలేదని కంపెనీ తెలిపింది. ఈ రెండు బైకులు కూడా 109.7cc, ఎయిర్ కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజిన్‌తో వస్తాయి. ఇవి గరిష్టంగా 8bhp పవర్, 8.7Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తాయి. మైలేజ్ , పర్ఫార్మెన్స్ విషయంలో రాజీ పడకుండా పాత ఇంజిన్ సామర్థ్యాన్నే ఇవి కొనసాగిస్తున్నాయి. ఇలాంటి మరిన్నిఆసక్తికర వార్తల (Auto News In Telugu) కోసం బిగ్ టీవీ లైవ్ వెబ్ సైట్ చూడండి.


Comments

Popular posts from this blog

Jana Nayagan: దళపతి జననాయగన్ రిలీజ్ సస్పెన్స్.. ఎన్నికల ముందే వస్తుందా? తర్వాతేనా?

Bharat Bandh feb 13th రేపే భారత్ బంద్.. ఏవి పనిచేస్తాయి? ఏవి పనిచేయవు? పూర్తి వివరాలు ఇవే!

NBK111 బాలయ్యతో మిల్క్ బ్యూటీ.. అబ్బా ఏం కాంబినేషన్‌రా బాబు