ప్రభాస్ vs రణబీర్ కపూర్… అసలేం ప్లాన్ చేస్తున్నావ్ సందీప్ రెడ్డి
ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో స్పిరిట్ అనే మూవీ వస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ మూవీ పూజా కార్యక్రమాలు కూడా ఇటీవల జరిగాయి. మెగాస్టార్ చిరంజీవి గెస్ట్‌గా వచ్చారు. ఇదిలా ఉండగా… చిరంజీవి అతిథి పాత్రలో నటించబోతున్నారంటూ వార్తలు వచ్చాయి కానీ ఈ వార్తలను పూర్తిగా సందీప్ రెడ్డి ఖండించారు. ఈ సినిమాలో క్యామియో పాత్రలో నటించడం కోసం టాలీవుడ్ హీరోలను కాకుండా సందీప్ రెడ్డి బాలీవుడ్ స్టార్ హీరోను రంగంలోకి దించబోతున్నారని తెలుస్తోంది.
ఈ సినిమాలో క్యామియో పాత్ర చాలా కీలకంగా ఉండబోతున్నట్లు సమాచారం. అందుకే సందీప్ రెడ్డి ఈ క్యామియో పాత్రలో నటించడం కోసం బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ (Ranbir Kapoor In Spirit) ను సంప్రదించడంతో రణబీర్ సైతం ఈ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ఇదివరకే సందీప్ రెడ్డి, రణబీర్ కపూర్ కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన యానిమల్ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుందో మనకు తెలిసిందే. అందుకే సందీప్ రెడ్డి అడగడంతో వెంటనే రణబీర్ కపూర్ స్పిరిట్ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. మరి స్పిరిట్ సినిమాలో రణబీర్ కపూర్ పాత్ర ఏంటి అనేది తెలియాల్సి ఉంది.
టాలీవుడ్ టూ బాలీవుడ్ (Movie News In Telugu)వరకు అన్నీ అప్డేట్స్ తెలుసుకోవాలంటే బిగ్ టీవీని ఫాలో అవ్వండి.

Comments
Post a Comment