Samantha Raj Nidimoru: డైరెక్టర్‌తో రిలేషన్ కన్ఫర్మ్ చేసిన సమంత.. వీడియో రిలీజ్
నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత సమంత ఇప్పటి వరకు సింగిల్ గానే ఉంది. నాగ చైతన్య... శోభితను పెళ్లి చేసుకుని వైవాహిక జీవితాన్ని మళ్లీ స్టార్ట్ చేశాడు. కానీ, సమంత చాలా రోజుల వరకు తన పెళ్లి గురించి, బాయ్ ఫ్రెండ్ గురించి అసలేం మాట్లాడలేదు. కానీ, ఈ మధ్య కాలంలో డైరెక్టర్ రాజ్ నిడుమోరితో సమంత రిలేషన్‌లో (Samantha Raj Nidimoru Relationship) ఉంది అనే గాసిప్స్ తెగ వైరల్ అవుతున్నాయి. ఆ గాసిప్స్‌కి తగ్గట్టే, ఈ జంట బాగానే షికార్లు చేస్తున్నారు. అదే టైంలో డైరెక్టర్ రాజ్ నిడుమోరి భార్య కూడా సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు కూడా వైరల్ అయ్యాయి.
ఇదిలా ఉండగా, సమంత రీసెంట్‌గా ఇన్‌స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ పెట్టింది. ఈ పోస్ట్‌ను చూసి డైరెక్టర్ రాజ్ నిడిమోరితో ఉన్న రిలేషన్‌ను అధికారికంగా ప్రకటించేసింది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. అంతలా ఆ పోస్టులో ఏం ఉందంటే... సమంత దుబాయ్ లో ఉన్నట్టు తెలుస్తుంది. అలాగే అబ్బాయి చేతిని కాస్త రొమాంటిక్ గా పట్టుకుని ఉంది. అది రాజ్ చేయే అని స్పష్టం అవుతుంది. అక్కడే What I See - What you See అంటూ రాసుకొచ్చింది. రిలేషన్ ని కన్ఫర్మ్ చేస్తూ పెట్టిన ఈ పోస్టులో తన అభిమానులకు కనిపెట్టుమని టాస్క్ ఇచ్చిందా ఏంటి అంటూ ఆలోచిస్తున్నారు.
ఇలాంటి ఎంటర్‌టైన్మెంట్ వార్తల (Entertainment News Telugu) కోసం బిగ్ టీవీ ఫాలో అవ్వండి.

Comments
Post a Comment