New GST Rates: 56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు
ట్రంప్ టారిఫ్ ప్రభావంతో భారత్‌లో జీఎస్టీలో మార్పులు వేగంగా చోటు చేసుకున్నాయి. బుధవారం జరిగిన 56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వాటి వివరాలను వెల్లడించారు. ఇప్పటి వరకు ఉన్న 5, 12, 18, 28 శాతం పన్ను స్లాబులు తగ్గి, ఇకపై కేవలం 5శాతం 18శాతం స్లాబులు మాత్రమే అమల్లో ఉండనున్నాయి. అయితే విలాసవస్తువులు, హానికర ఉత్పత్తులపై 40శాతం ప్రత్యేక పన్ను కొనసాగుతుంది. ప్రజల ఎన్నో ఏళ్ల డిమాండ్‌పై ఆరోగ్య, జీవిత బీమాలపై జీఎస్టీ (New GST Rates)పూర్తిగా రద్దు చేయబడింది. దీని వల్ల సీనియర్ సిటిజన్లకు, సాధారణ కుటుంబాలకు భారీ ఊరటనిచ్చింది.
నిత్యావసర వస్తువుల ధరలు కూడా గణనీయంగా తగ్గనున్నాయి. పాలు, పప్పులు, దుస్తులు, చెప్పులు, వెన్న, పన్నీర్, చీజ్, ప్యాకేజ్డ్ ఫుడ్స్, కార్న్‌ఫ్లేక్స్, బిస్కెట్లు, బాదం, జీడిపప్పు, కూరగాయల నూనెలు అన్నీ 5శాతం పన్ను పరిధిలోకి వస్తున్నాయి. ఇప్పటి వరకు వెయ్యి రూపాయల లోపు దుస్తులు, చెప్పులపై 5శాతం ఉండేది. ఇకపై రూ.2,500 లోపు వాటికి 5శాతం మాత్రమే ఉండగా, అంతకంటే ఎక్కువ ధరైన వాటికి 18శాతం పన్ను వర్తించనుంది. పెట్రోల్, డీజిల్, సిఎన్జీ వాహనాలు, ఆటోలు, బస్సులు, ట్రక్కులపై జీఎస్టీని 28 నుంచి 18శాతంకి తగ్గించారు. ఎలక్ట్రిక్ వాహనాలపై 5శాతం యథాతథంగా కొనసాగుతుంది. కేన్సర్, అత్యవసర మందులపై జీఎస్టీని పూర్తిగా ఎత్తివేశారు. ఈ కొత్త పన్ను విధానం సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి రానుంది.
మరిన్ని బిజినెస్ వార్తల (Business News In Telugu) కోసం ‘బిగ్ టీవీ లైవ్’ వెబ్ సైట్ ఫాలో అవ్వండి

Comments
Post a Comment