Naga Chaitanya సమంత కేసు : ఫస్ట్ టైం కోర్టు మెట్లెక్కిన నాగ చైతన్య
అక్కినేని నాగ చైతన్య ఫస్ట్ టైం కోర్టు మెట్లెక్కాడు. దీనికి కారణం సమంత కేసే. తండ్రి నాగార్జునతో కలిసి నాగ చైతన్య నాంపల్లి కోర్టుకు వచ్చాడు. అసలు మ్యాటరేంటంటే... కొన్ని రోజుల క్రితం తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండ సురేఖ.. నాగ చైతన్య - సమంత విడాకులపై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ నేపథ్యంలో కొండ సురేఖపై నాంపల్లి కోర్టులో కేసు నమోదు అయింది. దీనిపై చాలా రోజుల నుంచి విచారణ జరుగుతుంది.
తాజాగా, ఈ కేసుకు సంబంధించి అక్కినేని నాగార్జున, ఆయన కుమారుడు నాగ చైతన్య నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. కొండ సురేఖ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో వీరి ఇద్దరి స్టెట్మెంట్ రికార్డు చేయనున్నారు. కాగా, ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగ చైతన్య, సమంత... రెండేళ్లు గడవక ముందే విడాకులు తీసుకున్నారు. ఈ విడాకుల వెనకాల మాజీ మంత్రి కేటీఆర్ హస్తం ఉంది అంటూ కొండ సురేఖ సంచనల ఆరోపణలు చేసింది. ఆ కేసు (konda surekha defamation case) విచారణనే ఇప్పుడు నాంపల్లి కోర్టులో జరుగుతుంది. ఇప్పటికే పలుమార్లు నాగార్జున కోర్టుకు హాజరయ్యాడు. నేడు నాగ చైతన్య ఫస్ట్ టైం కోర్టు మెట్లు ఎక్కాడు.
ఇలాంటి ఇంట్రెస్టింగ్ వార్తలను (Latest Movie News)ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే... బిగ్ టీవీని ఫాలో అవ్వండి.

Comments
Post a Comment