Harish Rao On Kavitha: కవిత వ్యాఖ్యలపై.. స్పందించిన హరీష్ రావు, ఏంటీ అలా అనేశారు?

మాజీ మంత్రి హరీష్ రావు.. ఎట్టకేలకు కవిత వ్యాఖ్యలపై స్పందించారు. లండన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో కవిత ఆరోపణలపై అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారట. ప్రస్తుతం హరీష్ రావు యూకేలోనే ఉన్నారు. శుక్రవారం సాయంత్రానికి హైదరాబాద్ వచ్చే అవకాశాలున్నాయి. తన కూతురు అడ్మిషన్ కోసం ఆయన కొద్ది రోజులుగా లండన్‌లోనే ఉంటున్నారు. అక్కడ ‘బిగ్ టీవీ లైవ్’ మీడియా ప్రతినిధి కవిత అంశంపై హరీష్ రావును (Harish Rao On Kavitha)ప్రశ్నించారు. 



కవిత ఆరోపణలపై మీ రియాక్షన్ ఏంటి అన్న ప్రశ్నకు ఆయన నేరుగా సమాధానం ఇవ్వలేదు. హరీష్‌రావు పక్కనున్న ఓ వ్యక్తి ఈ అంశంపై ఇండియాకు వెళ్లి మాట్లాడుతారని చెప్పే ప్రయత్నం చేశారు. లండన్‌లో జరిగిన ‘బీట్‌ అండ్‌ గ్రీట్‌’ ఈవెంట్‌లో కూడా హరీష్ రావుకు ఈ ప్రశ్నలు ఎదురయ్యాయట. కవిత విమర్శలపై మీరేమంటారని పలువురు ప్రశ్నించారట. ఆమె వ్యాఖ్యలను హరీష్ రావు సీరియస్‌గా తీసుకోలేనట్లు తెలిసింది. 


ఈ అంశంపై ఇప్పటికే చాలాసార్లు క్లారిటీ ఇచ్చానని మాట దాటవేశారట. ‘‘పార్టీలో నేను ఒక క్రమశిక్షణ గల కార్యకర్తను. కేసీఆర్ నాయకత్వంలో చివరి శ్వాస వరకు పని చేస్తా. ఈ విషయంలో పార్టీ తీసుకున్న ఏ నిర్ణయాన్నైనా శిరసా వహిస్తా. పార్టీ మొదటి నుంచి కేసీఆర్‌ అడుగుజాడల్లో పని చేశా. భవిష్యత్‌లో కూడా పని చేస్తా’’ అని వెల్లడించారట. హైదరాబాద్ వచ్చిన వెంటనే హరీష్.. నేరుగా కేసీఆర్‌ను కలవనున్నట్లు తెలిసింది. ఆ తర్వాతే మీడియాతో మాట్లాడే అవకాశాలున్నాయని సమాచారం. మరిన్ని తెలంగాణ వార్తల (Telangana Latest news Today) కోసం ‘బిగ్ టీవీ లైవ్’ వెబ్ సైట్ చూడండి.

Comments

Popular posts from this blog

Jana Nayagan: దళపతి జననాయగన్ రిలీజ్ సస్పెన్స్.. ఎన్నికల ముందే వస్తుందా? తర్వాతేనా?

Bharat Bandh feb 13th రేపే భారత్ బంద్.. ఏవి పనిచేస్తాయి? ఏవి పనిచేయవు? పూర్తి వివరాలు ఇవే!

NBK111 బాలయ్యతో మిల్క్ బ్యూటీ.. అబ్బా ఏం కాంబినేషన్‌రా బాబు